EU Chief Modi : యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ (చీఫ్ ) ఉర్సులా వాన్ డెర్ లేయన్ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య కొత్త కౌన్సిల్ ను ఏర్పాటు చేసేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా భారత దేశం – ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ను ప్రారంభించాయి.
ఇది వాణిజ్యం, విశ్వసనీయ సాంకేతికత , భద్రతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మక యంత్రాంగాన్ని ప్రారంభించింది.
భారత దేశం తన భాగస్వాముల్లో ఎవరితో నైనా ఇటువంటి వాణిజయం, సాంకేతిక మండలి ఏర్పాటుకు అంగీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈయూ కోసం యుఎస్ తో ఏర్పాటు చేసిన మొదటి సంస్థ తర్వాత భారత్ తో ఇది రెండోది . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్(EU Chief Modi ) మధ్య జరిగిన సమావేశంలో కౌన్సిల్ ను ప్రారంభించడంపై ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది.
వాణిజ్యం, సాంకేతికతపై ఇరు పక్షాల మధ్య సహకారాన్ని మరింత పెంచుతుందని అంచనా. భౌగోళిక రాజకీయ వాతావరణంలో వేగవంతమైన మార్పులు ఉమ్మడి లోతైన వ్యూహాత్మక ఒప్పందం ఉందని ఇరు పక్షాలు అంగీకరించయి.
ఉమ్మడి ప్రకటన చేసింది. వాణిజ్యం, సాంకేతిక మండలి భారతీయ, ఐరోపా దేశాల స్థిరమైన పురోగతికి దోహద పడుతుందని భావిస్తుంది.