ED Raids ABG : మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణలో భాగంగా ఏబీజీ షిప్ యార్డు లోని 26 ప్రదేశాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది.
ఏబీజీ షిప్ యార్డు లిమిటెడ్ 28 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ. 22 , 842 కోట్ల మేర మోసానికి పాల్పడిందంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఆరోపించింది.
మంగళవారం మూకుమ్మడిగా ఏకకాలంలో దాడులకు పాల్పడింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ముంబై, పూణే, సూరత్, తదితర ప్రాంతాల్లో ఏబీజీ షిప్ యార్డు, దాని సోదర కంపెనీలు, ఎగ్జిక్యూటీవ్ ల ప్రాంగణాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రారంభించిన దర్యాప్తులో సీబీఐ దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఫిబ్రవరిలో ఈ విషయానికి సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసు(ED Raids ABG) నమోదు చేసింది.
బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను 100కి పైగా షెల్ కంపెనీల ద్వారా భారత దేశంతో పాటు ఇతర దేశాలకు మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని 28 బ్యాంకుల కన్సార్టియంను రూ. 22, 842 కోట్లకు శఠగోపం పెట్టిందంటూ సీబీఐ ఆరోపించింది.
ఇదిలా ఉండగా ఏబీజీ షిప్ యార్డుకు సంబంధించి అత్యధికంగా ఇచ్చిన బ్యాంకులలో ఐసీసీఐ రూ. 7, 089 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు రూ. 3, 639 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2, 925 కోట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 1, 614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 1, 244 కెట్లు ఉన్నాయి.
Also Read : విద్యుత్ సంక్షోభంపై ధోనీ భార్య ఫైర్