Donald Trump : యావత్ ప్రపంచానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను భారీ ఎత్తున ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేశాడు.
దీంతో కొంతర గందరగోళానికి, అనిశ్చితికి దారి తీస్తోందంటూ ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఆందోళనలకు బాధ్యత వహిస్తూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పై నిషేధం విధించింది ట్విట్టర్.
ఈ సందర్భంగా ఎలోన్ మస్క్ కైవసం చేసుకోవడంతో వెంటనే ట్రంప్ ఖాతాను పునరుద్దరించాలని కోరారు. ఇదే సరైన తరుణమని పేర్కొన్నారు.
టోటల్ గా ట్విట్టర్ ను కైవసం చేసుకుంటున్నట్లు ప్రకటించాడు మస్క్. ఇదిలా ఉండగా మస్క్ ఓన్ చేసుకోవడంతో ట్రంప్ ఖాతా తిరిగి పునరుద్దరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ఎలోన్ మస్క్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపాడు.
తాను ఎట్టి పరిస్థితుల్లో ట్వి్ట్టర్ లో ఖాతాను తెరవనని ప్రకటించారు. అంతే కాదు ఎలోన్ మస్క్ చాలా మంచి వారన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో తాను చేరనని కుండ బద్దలు కొట్టారు. ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. తాను ప్రాణ పదంగా ఏర్పాటు చేసిన ట్రుథ్ సోషల్ లోనే ఉంటానని స్పష్టం చేశారు మాజీ ప్రెసిడెంట్.
Also Read : బ్రిటన్ ప్రధాని జాన్సన్ తో అదానీ భేటీ