S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్(S Jai Shankar )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా వార్ పై స్పందించారు. ఈ యుద్దం ఐరోపా మేలుకొనేందుకు మార్గం లాంటిందని పేర్కొన్నారు.
తాము స్పందించడం లేదంటూ వస్తున్న విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. యావత్ ప్రపంచంలోని కొంత సమాజం తమను మీరేమీ మాట్లాడటం లేదంటోంది.
కానీ ఇటీవలే ఆఫ్గనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఇదే సమాజం ఎందుకని మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం , రూల్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి కదా అని నిలదీశారు.
రైసినా డైలాగ్ లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ లో జై శంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు.
గత ఏడాది ఆఫ్గాన్ లో జరిగిన సంఘటనలు, ఆ ప్రాంతంలో నిబంధనల ఆధారిత క్రమంపై నిరంతర ఒత్తిడితో సహా ఆసియా ఎదుర్కొంటున్న సవాళ్లను పాశ్చాత్య శక్తులు పట్టించు కోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జై శంకర్(S Jai Shankar ).
గత పది సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఉక్రెయిన్ పరిస్థితిపై నార్వే విదేశాంగ మంత్రి అన్ని కెన్ హ్యూట్ ఫెల్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.
ఉక్రెయిన్, రష్యాలు వెంటనే యుద్దాన్ని విరమించాలని, దౌత్యం, సంభాషణల ద్వారా పరిష్కరించు కోవాలని జై శంకర్ సూచించారు.
Also Read : ఏబీజీ షిప్ యార్డుపై ఈడీ దాడులు