Prashant Kishor : గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యవహారానికి చెక్ పడింది. ఆయన హాట్ టాపిక్ గా మారారు. నాలుగు సార్లకు పైగా కాంగ్రెస్ పార్టీతో భేటీ అయ్యారు.
ఆ మేరకు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీకి బ్లూ ప్రింట్ అందజేశారు. ఆపై 600 పేజీల పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇచ్చారు. ఇదే సమయంలో ఫుల్ క్లారిటీ వచ్చేలా చేశారు.
ఆపై రోడ్ మ్యాప్ కూడా దేశ వ్యాప్తంగా సిద్దం చేసి ఉంచారు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రమైన చర్చ జరిగింది. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్(Prashant Kishor )ను కన్సల్టెంట్ గా కాకుండా పార్టీలో చేరాలని హైకమాండ్ కోరింది.
ఈ కీలక భేటీలో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అంబికా సోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు పీకే ఇచ్చిన రిపోర్ట్ గురించి పరిశీలించేందుకు మేడం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా నివేదిక ఇవాళ ఇచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో దాదాపు పీకే చేరిక ఖాయమై పోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కానీ చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రశాంత్ కిషోర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ ప్రకటించారు. హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ ను ఆయన తిరస్కరించారు.
ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా. పీకే తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.
Also Read : ఉక్రెయిన్ వార్ ఐరోపాకు మేలుకొలుపు