Jignesh Mevani : గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్ మంజూరైంది. ఆ వెంటనే మరో కేసులో ఆయనను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచారు.
దీంతో ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపారు. అస్సాంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి వేధింపులకు పాల్పడిన కేసులో ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని(Jignesh Mevani) అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు పోలీసులు.
ఇదిలా ఉండగా జిగ్నేష్ మేవానీ తరపు న్యాయవాది మాట్లాడారు. బుధవారం బార్ పేటలోని హైకోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
ఆయనను మొదటగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారని, ఆయనపై తూలనాడుతూ ట్వీట్లు చేశారని ఆరోపించారు.
ఈ మేరకు అస్సాం బీజేపీ నేత చేసిన ఫిర్యాదు మేరకు జిగ్నేష్ మేవానీపై కేసు నమోదు చేశారు అస్సాం పోలీసులు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఉంటున్న ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు.
అహ్మదాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి అస్సాం లోని గౌహతికి తీసుకు వచ్చారు. ఇదిలా ఉండగా పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి వేధింపులకు పాల్పడిన కేసులో కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.
ఈనెల 21న కేసు నమోదైంది. మేవానీ బహిరంగంగా అసభ్యకరమైన చర్యలు, పదాలు వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై న్యాయవాది మండిపడ్డారు.
మేవానీ మూడు రోజుల పాటు కస్టడీలో ఉన్నప్పుడు అధికారులపై దాడి చేసినట్లు ఎక్కడా ఆరోపణలు లేవు. ఆయనకు బెయిల్ మంజూరు అయిన తర్వాత తిరిగి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమంటూ ఆరోపించారు.
Also Read : కాంగ్రెస్ లో పీకే చేరడం లేదు