G Kishan Reddy : భారతీయ జనతా పార్టీ ఏకైక నినాదం ఒకే దేశం ఒకే భాష. ఆ దిశగానే ప్రయాణం చేస్తోంది. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా తేనె తుట్టెను కదిలించారు. ఆయన హిందీ భాష విషయంలో చేసిన కామెంట్స్ కాకలు రేపుతోంది.
కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చివరికి అన్ని రంగాలకు పాకింది. తాజాగా కన్నడ నటుడు సుదీప్ , బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ల మధ్య నడిచిన ట్వీట్ల వర్షం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య, కుమార స్వామి. ఇక అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీకి చెందిన తమిళనాడు చీఫ్ అన్నామలై.
తమిళం తమకు ముఖ్యమని, వేరే భాషను తమపై ప్రయోగిస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. తాజాగా ఈ భాషా వివాదం రోజు రోజుకు మరింత రాజుకుంటోంది. దీంతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి (G Kishan Reddy)స్పందించారు.
హిందీ జాతీయ భాష అని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందులో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇక పలు రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కేంద్రం కావాలని తన ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అంటున్నాయి. తాము ఒప్పుకోబోమంటూ పేర్కొన్నారు.
తమిళం ప్రియం అదే మాకు మూలం అని దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. ఇక మా భాష హిందీ కంటే ప్రాచీనమైదని పేర్కొన్నారు సిద్దరామయ్య.
Also Read : ధరణి కోసం సద్గురు ప్రయాణం