Kamalnath : మధ్యప్రదేశ్ లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరొందారు కమల్ నాథ్. ఇంత కాలం జోడు పదవులు చేపట్టారు. ఓ వైపు సీఎల్పీ నాయకుడిగా మరో వైపు రాస్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు.
కానీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఒకరికి ఒకే పదవి అన్న నిబంధన తీసుకు వచ్చింది. దాంతో కమల్ నాథ్(Kamalnath )తాను సీఎల్పీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన రాజీనామాను సోనియా గాంధీ ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్. ఆయన ఇక నుంచి సీఎల్పీ నాయకుడిగా ఉండరు.
కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా కొనసాగుతారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తానని ప్రకటించారు కమల్ నాథ్.
ఆయన స్థానంలో కాంగ్రెస పార్టీ డాక్టర్ గోవింద్ సింగ్ ను సీఎల్పీ లీడర్ గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా దీనిపై రాష్ట్ర బీజేపీ స్పందించింది.
ఆ పార్టీ మీడియా కన్వీనర్ లోకేంద్ర పరాశర్ ఆయన త్వరలో పార్టీని వీడడం ఖాయమన్నారు. గోవింద్ సింగ్ కు పగ్గాలు అప్పగించడం అంటే దిగ్విజయ్ సింగ్ శకం మళ్లీ వస్తుందని పేర్కొన్నారు.
ఇవాళో రేపో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడం ఖాయం. గిరిజన బలమైన వ్యక్తి ఉమంగ్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జోష్యం చెప్పారు. సీఎల్పీ నేతగా క్షత్రియ రాజకీయ నాయకుడిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించింది బీజేపీ.
Also Read : కళాకారులకు ఇదా మీరిచ్చే గౌరవం