UN Chief : సైనిక ప్రయోగం పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాను నియంత్రించడంలో యుఎన్ భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్ ) ఘోరంగా విఫలం చెందిందంటూ ఐక్య రాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వైపు ఉక్రెయిన్ ను సందర్శించిన ఆయన తవ్ర ఆవేదన(UN Chief )వ్యక్తం చేశారు. ఒక రకంగా కన్నీటి పర్యంతం అయ్యారు.
తన ఫ్యామిలీని కోల్పోయినట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ తరుణంలో యుద్దం నిలువరించే శక్తి ఉన్నప్పటికీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆ దిశగా ప్రయత్నం చేయడంలో వెనుకంజ వేసిందన్నారు గుటెర్రెస్.
నన్ను మాట్లాడనివ్వండి అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మారణ కాండ కు ముగింపు అన్నది లేదా అని ప్రశ్నించారు. యుద్దాన్ని ఇలా ఎంత కాలం కొనసాగిస్తూ వస్తారని ప్రశ్నించారు.
దీనికి అంతం అన్నది లేదా అని నిలదీశారు. ఇవాళ ఉక్రెయిన్ కు జరిగింది. రేపు మిగతా ప్రపంచానికి ముప్పు వాటిల్లదని మనం హామీ ఇవ్వగలమా. ఇదేనా మనం నేర్చుకున్నది.
ఇదేనా మనం అనుసరిస్తున్నది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాను నిలువరించడంలో, కట్టడి చేయడంలో తాము విఫలమైనట్లు ఒప్పుకుంటున్నట్లు చెప్పారు యుఎన్ చీఫ్(UN Chief ).
ఇది అత్యంత బాధ్యాత రాహిత్యానికి పరాకాష్టగా నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను సందర్శించిన అనంతరం ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు జెలెన్స్కీ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం యుఎన్ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన ప్రధానంగా రష్యాను తప్పు పట్టారు.
Also Read : పాక్ ఆర్మీని వేడుకున్న ఇమ్రాన్ ఖాన్