Jignesh Mevani : అస్సాం సీఎంపై మేవానీ ఫైర్

ప్ర‌జా స‌మ‌స్య‌లపై ఫోక‌స్ పెట్టండి

Jignesh Mevani : గుజ‌రాత్ స్వ‌తంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్రంతో పాటు అస్సాం బీజేపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు.

సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు పోకుండా కుల‌, మ‌తాలతో రాజ‌కీయం చేయ‌కుండా పాల‌న సాగించాల‌ని సూచించారు. త‌నను అరెస్ట్ చేయ‌డంలో ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని హిత‌వు ప‌లికారు.

అస్సాంలో లెక్కించ లేనంత స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని చెప్పారు. త‌న‌ను కావాల‌ని ఇరికించార‌ని, మ‌హిళా కానిస్టేబుల్ ను అడ్డం పెట్టుకుని ఫేక్ కేసు న‌మోదు చేశారంటూ ఆరోపించారు.

దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది కోర్టు. అస్సాంలో పోలీస్ స్టేట్ న‌డుస్తోందా అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాన మంత్రిపై తాను చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వేన‌ని స్ప‌ష్టం చేశారు.

తాను అన్న మాట‌ల‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani)చెప్పారు. తాను గుజ‌రాత్ లో నెల‌కొన్న‌, పేరుకు పోయిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఓ భార‌తీయ పౌరుడిగా ప్ర‌శ్నించాన‌ని ఇది త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేల‌ను, ప్ర‌త్యేకించి బీజేపీయేత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను నిరాధార ఆరోణ‌ల పేరుతో అరెస్ట్ చేయ‌డం మానుకోవాల‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. మోదీపై అభ్యంత‌ర‌క‌ర‌మైన ట్వీట్లు చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఈనెల 21న అరెస్ట్ చేసి అస్సాంకు తీసుకు వ‌చ్చారు.

ఈ కేసులో 25న బెయిల్ వ‌చ్చింది. ఆ వెంట‌నే మ‌హిళా కానిస్టేబుల్ ను వేధించాడంటూ మ‌రో కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టు సీరియ‌స్ అయ్యింది. బెయిల్ మంజూరు చేసింది.

Also Read : కేంద్ర స‌ర్కార్ పై బీజేపీ ఎంపీ కన్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!