Bhagwant Mann : ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మరాఠా సీఎం కు అభినందనలు తెలియ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ అరుదైన సన్నివేశానికి వేదికైంది పంజాబ్. ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన రైతులు పండించిన పండ్లను శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పార్టీ నాయకుల బృందం ఆదివారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను కలిసి అందజేసింది.
ఈ సందర్భంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ధన్యవాదాలు తెలియ చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann). మరాఠా రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు.
తాను ఈ బహుమానాన్ని ఊహించ లేదని, తనను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని రైతులు స్వతహాగా పండించిన వాటిని అందించినందుకు కలకాలం గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
భగవంత్ మాన్ సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చాడు. ఈ పంజాబ్ సీఎం మొదట కమెడియన్ , ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారారు. ఆయనకు దేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్ అంటే చచ్చేంత ఇష్టం.
ఎక్కడికి వెళ్లినా ఇంక్విలాబ్ జిందాబాద్ ( విప్లవం వర్దిల్లాలి ) అని నినదిస్తూనే ఉంటారు. తాను సీఎంగా ఎన్నికయ్యాక రాజ్ భవన్ లో కాక కంగర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం భగవంత్ మాన్ చేసిన ట్వీట్ కు ఎన్సీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎన్సీపీ నేతలకు తేనీటి విందు ఇచ్చారు సీఎం.
Also Read : పాటియాలా కేసులో బర్జిందర్ పర్వానా అరెస్ట్