Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మొయిత్రా (Mahua Moitra)సంచలన కామెంట్స్ చేశారు. ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.
తాజాగా ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజ చైనా కంపెనీ అయిన షావోమీ ఫెరా చట్టాలు ఉల్లంఘించిందంటూ రూ. 5, 551.27 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వేల కోట్లకు పైగా ఆస్తుల సీజ్ అంటే మామూలు విషయం కాదు.
ఈ తరుణంలో టీఎంసీ ఎంపీ ప్రధాన మంత్రి కేర్ ఫండ్స్ కు రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు కేంద్రం ఎలా పర్మిషన్ ఇచ్చిందంటూ ప్రశ్నించారు.
ఓ వైపు ఆస్తుల జప్తు ఇంకో వైపు విరాళాల సేకరణ ఎలా చేస్తారంటూ ఈ దేశానికి తెలియ చేయాల్సిన బాధ్యత ప్రధాన మంత్రిపై ఉందన్నారు. ప్రస్తుతం ఎంపీ పలు ప్రశ్నలు లేవదీశారు.
వీటికి సమాధానం చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ బ్యాంకు ఖాతాలను, ఆస్తులను సీజ్ చేసింది.
ఇదిలా ఉండగా షావోమీ ఇండియా ఎంఐ బ్రాండ్ పేరుతో భారత దేశంలో మొబైల్ ఫోన్ ల వ్యాపారిగా , పంపిణీదారుగా ఉంది. తన కార్యకలాపాలను 2014లో ప్రారంభించింది.
2015 నుంచి డబ్బులను అక్రమ మార్గాల ద్వారా , అంటే కేంద్ర సర్కార్ ఆదాయ పన్ను శాఖకు తెలియకుండా ఫెరా రూల్స్ భగ్నం చేస్తూ పంపించిందని ఈడీ ఆరోపించింది. ఈ తరుణంలో మహూవా ప్రధానిని ప్రశ్నించడం కలకలం రేగింది.
Also Read : రాజకీయం ఆయనకు ఓ వ్యాపారం