Uddhav Thackeray : రాజ‌కీయం ఆయ‌న‌కు ఓ వ్యాపారం

రాజ్ థాక‌రే పై ఉద్ధ‌వ్ థాక‌రే

Uddhav Thackeray : శివ‌సేన పార్టీ చీఫ్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక‌రే (Uddhav Thackeray) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర న‌వ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక‌రేపై నిప్పులు చెరిగారు.

ఆయ‌న‌కు రాజ‌కీయం అన్న‌ది ఓ వ్యాపార‌మ‌ని కానీ త‌మ‌కు మాత్రం సేవా భావంతో కూడిన కార్య‌క్ర‌మంగా భావిస్తామ‌ని చెప్పారు. లౌడ్ స్పీక‌ర్లు తొల‌గించాల‌ని లేని ప‌క్షంలో తాము హ‌నుమాన్ చాలిసా ప‌ఠిస్తామంటూ హెచ్చ‌రించారు రాజ్ థాక‌రే.

ఈ సంద‌ర్బంగా మ‌రాఠా స‌ర్కార్ కు డెడ్ లైన్ కూడా విధించారు. దీనిపై సీరియ‌స్ గా స్ందించారు సీఎం. జ‌నం ఓ వైపు ఆక‌లి కేక‌ల‌తో, ఉపాధి లేక నానా తంటాలు ప‌డుతుంటే తాము వారికి అండ‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు.

ఈ త‌రుణంలో కొంద‌రు మ‌తం, కులం, ప్రాంతం పేరుతో అన‌వ‌స‌ర అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ లేని పోని ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా మ‌రాఠా స‌ర్కార్ కు కేంద్రానికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో రాజ్ థాక‌రే మోదీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ ఆరోపించారు.

ఈ త‌రుణంలో సీఎం ఉద్ద‌వ్ థాక‌రే(Uddhav Thackeray) సైతం తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు రాజ్ థాక‌రే మీద‌. కొంద‌రు త‌మ స్వ‌లాభం కోసం ఎప్పుడూ జెండాలు మారుస్తూ ఉంటార‌ని ఎద్దేవా చేశారు.

కొన్ని రోజుల కింద‌ట మ‌రాఠీయేత‌ర వ్య‌క్తుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించార‌ని, ప్ర‌స్తుతం హైందవేత‌రుల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని ఫైర్ అయ్యారు.

Also Read : మ‌రాఠా రైతుల‌కు వంద‌నం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!