Asaduddin Owaisi : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ ) పై భారతీయ జనతా పార్టీ రాద్దాంతం చేస్తోందంటూ మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దన్ ఓవైసీ(Asaduddin Owaisi ). యూససీ ఉండాల్సిందేనంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఉత్తరాఖండ్ లో ప్రభుత్వం యుసీసీ అమలు చేసేందుకు గాను ముసాయిదా తీర్మానం తయారు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ.
ఇదిలా ఉండగా అస్సాం సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలు ఒక భర్తకు ముగ్గురు భార్యలు ఉండడాన్ని ఒప్పుకునేందుకు ఇష్ట పడడం లేదన్నారు.
ఈ తరుణంలో ఓవైసీ నిప్పులు చెరిగారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై. దేశంలో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో చేతులెత్తేసిందంటూ ధ్వజమెత్తారు.
వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే యూసీసీని ముందుకు తెచ్చారంటూ ఆరోపించారు ఎంపీ. ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
దేశానికి సంబంధించి వివిధ వర్గాల ప్రజలందరికీ ఒకే రకమైన విధానం అవసరం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. బొగ్గు రవాణా కోసం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేస్తున్నారు. నిరుద్యోగం పెరిగింది.
ఈ సమయంలో యూసీసీ గురించి ఆందోళన చెందడం విడ్డూరంగా ఉందన్నారు ఓవైసీ. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు ఓవైసీ(Asaduddin Owaisi ). హిందూ అవిభక్త కుటుంబ పన్ను రాయితీ ముస్లింలు, క్రిస్టియన్లకు ఎందుకు లేదని నిలదీశారు.
మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ సంస్కృతికి రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం హామీ ఇచ్చిందని దానిని తొలగిస్తారా అని మండిపడ్డారు ఎంపీ.
Also Read : నేను అలా అనలేదు – కేటీఆర్