Spice Jet : ముంబై నుంచి దుర్గాపూర్ కు వెళుతున్న స్పైస్ జెట్ విమానం(Spice Jet )వాతావరణంలో మార్పుల కారణంగా తీవ్ర కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదు. పైలట్ చాకచక్యంతో దుర్గాపూర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది.
ఇదిలా ఉండగా ఈ భారీ కుదపునకు పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు. 12 మందికి గాయాలైనట్లు స్పైస్ జెట్(Spice Jet )వెల్లడించింది. గమ్య స్థాన విమానశ్రయానికి దిగుతుండగా తీవ్ర అల్లకల్లోలం కారణంగా ఇబ్బంది ఏర్పడింది.
బి 737 బోయింగ్ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించారు. మరికొందరిని ఆస్పత్రికి తరలించినట్లు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్పైస్ జెట్ బోయింగ్ బి 737 ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఎస్ జీ -945 ముంబై నుండి దుర్గాపూర్ కు దిగుతున్న్పుడు తీవ్ర అల్లకల్లోలాన్ని ఎదుర్కొంది.
దురదృష్ట వశాత్తు కొంత మంది ప్రయాణీకులకు గాయాలైనట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో ప్రతి కూల వాతావరణం కారణంగా ఇది చోటు చేసుకుందని స్పైస్ జెట్ వెల్లడించింది.
ఇద్దరు ప్రయాణికులు ఫుడ్ ట్రాలీకి తమను తాము ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్ట సంఘటనపై స్పైస్ జెట్ విచారం వ్యక్తం చేస్తోందని తెలిపింది.
గాయపడిన వారందరినీ సురక్షితంగా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. ఇదే సమయంలో బోయింగ్ విమానం దుర్గాపూర్ ఎయిర్ పోర్ట్ లోనే ఉందని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు.
ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తంగా పైలట్ ముందు చూపుతో పెను ప్రమాదం తప్పింది.
Also Read : చైనా లక్ష్మణ రేఖ దాటితే జాగ్రత్త