Raj Thackeray : ఈనెల 4న ఏం జరగబోతోంది మరాఠాలో. ఇదే చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ప్రధాన కారణం మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే ఆయా ప్రార్థన మందిరాల వద్ద లౌడ్ స్పీకర్లు తొలగించాలని లేక పోతే అక్కడ హనుమాన్ చాలీసా వినిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఈనెల 4న తుది గడువు విధించారు. ఆ తర్వాత ఏం జరిగినా తాము బాధ్యత వహించబోమన్నారు.
లౌడ్ స్పీకర్ల సమస్య కొత్తం అంశం కాదన్నారు. అసలు మతానికి సంబంధించి అసలే కాదని స్పష్టం చేశారు. ఆ లౌడ్ స్పీకర్లలో చాలీసా వాయిస్తారని వాల్యూమ్ ను రెట్టింపు చేస్తారని ఎంఎన్ఎస్ చీఫ్ చెప్పారు.
ఈనెల 3వ తేదీ లోపు అన్ని లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాను ఇచ్చి అల్టిమేటంకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఇక మే 4 నుంచి తాను ఎవరి మాట వినబోనంటూ కుండ బద్దలు కొట్టారు.
యూపీలో మసీదులు, దేవాలయాల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించారని మరి మరాఠాలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు రాజ్ థాకరే(Raj Thackeray). ఔరంగాబాద్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.
ఇదే సమయంలో సీఎం ఇంటి ముందు చాలీసా పఠించేందుకు యత్నించిన ఎంపీ నవనీత్ కౌర్ , ఎమ్మెల్యే రవి రాణాలను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు కస్టడీకి ఆదేశించింది కోర్టు.
Also Read : షావోమీ 10 కోట్ల విరాళంపై మహూవా ఫైర్