Punjab Govt : సిక్కు చరిత్ర వక్రీకరణ..పుస్తకాలపై నిషేధం
సీఎం భగవంత్ మాన్ ఆదేశాల మేరకు నిర్ణయం
Punjab Govt : పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిక్కు చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించినందుకు పుస్తకాలను నిషేధించింది.
ఇందుకు సంబంధించి బాధ్యులైన రచయితలు, ప్రచురణ కర్తలపై చర్యలు తీసుకుంటామని పంజాబ్ విద్యా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్(Punjab Govt )వెల్లడించారు.
ఇదిలా ఉండగా సిక్కు చరిత్ర వక్రీకరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ పుస్తకాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు మూడు పుస్తకాలను నిషేధించినట్లు మంత్రి తెలిపారు.
సిక్కు చరిత్ర మనందరికీ, భవిష్యత్తు తరాలకు అమూల్యమైనది. 12వ తరగతికి చెందిన హిస్టరీ ఆఫ్ పంజాబ్ పుస్తకంలో సిక్కు చరిత్రకు సంబంధించి తప్పుడు సమాచారం పొందు పరిచారు.
సీఎం భగవంత్ మాన్ (Punjab Govt )ఆదేశాల మేరకు రచయితలు, ప్రచురణకర్తలపై చర్యలు తీసుకోవాలని, పుస్తకాల వినియోగాన్ని నిషేధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ చెప్పారు.
విద్యార్థులకు మంచి విద్యను అందించడంతో పాటు గురువుల చరిత్ర, సిక్కు ప్రపంచం, పంజాబ్ వారికి అవగాహన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
నిషేధించబడిన పుస్తకాలలో మంజిత్ సింగ్ సోధీ రాసిన మోడరన్ ఏబీసీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ పంజాబ్ , మహేందర్ పాల్ కౌర్ రాసిన హిస్టరీ ఆఫ్ పంజాబ్ , ఎంఎస్ మాన్ రచించిన హిస్టరీ ఆఫ్ పంజాబ్ పుస్తకాలు ఉన్నాయి.
ఈ పుస్తకాల్లో సిక్కు చరిత్రకు అనుగుణంగాలేని కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయంటూ రైతు నాయకుడు బల్దేవ్ సింగ్ సిర్సా ఆరోపించారు. దీనిపై కమిటీ వేసింది. సర్కార్.
Also Read : రాజకీయం ఆయనకు ఓ వ్యాపారం