Jignesh Mevani : గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ నిప్పులు చెరిగారు. అస్సాం ప్రభుత్వం తన పట్ల అనుసరించిన తీరుపై మండిపడ్డారు. ప్రధాన మంత్రిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని తన నివాసంలో ఉన్న సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి గౌహతికి తరలించారు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ ను దుర్భాష లాడారని, దాడి చేసేందుకు యత్నించారంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ పై విడుదలైన అనంతరం జిగ్నేష్ మేవానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పై సీరియస్ అయ్యారు.
ఈ ఏడాది చివర్లో రాష్ట్ర ఎన్నికలకు ముందు తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రధాని కుట్ర పన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
విచిత్రం ఏమిటంటే సంస్కృతి , సంప్రదాయం గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఒక మహిళ కానిస్టేబుల్ ను అడ్డం పెట్టుకుని తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.
ఈ ప్రధానమైన కుట్రకు తెర తీసింది మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani).
తనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు అస్సాంకు చెందిన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిగ్గు పడాలని జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani) అన్నారు.
Also Read : వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయలేం