Ajit Pawar : మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం మరింత ముదిరింది. ఇరు రాష్ట్రాల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కొన్ని ప్రాంతాలను తాము వదిలే ప్రసక్తి లేదని , ఏనాటికైనా స్వాధీనం చేసుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ సీరియస్ అయ్యారు.
మహారాష్ట్ర లో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడల్లా వాళ్లకు పదే పదే గుర్తుకు వచ్చేది మాత్రం మరాఠీ మాట్లాడే ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ ఆరోపించారు.
వాళ్ల మాటలన్నీ కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకు తప్పా మరొకటి కాదన్నారు. రాజకీయంగా నిలదొక్కు కునేందుకు ఇప్పుడు ఈ భాషా పంథాను సృష్టించారంటూ మండిపడ్డారు.
బీదర్, భాల్కీ, బెల్గాం, కార్వార్ , నిప్పాణి , తదితర ప్రాంతాలను తాము స్వాధీనం చేసుకుని తీరుతామన్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar).
ఈ గ్రామాలన్నీ మహారాష్ట్రలో భాగమయ్యే వరకు తాము మద్దతు ఇస్తామని చెప్పారు. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే జనాభా మెజారిటీగా ఉందని, అందువల్ల రాష్ట్రంలో భాగం కావాలని వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా కర్ణాటక లోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్‌ట్రలో విలీనానికి మద్దతు ఇచ్చినందుకు అజిత్ పవార్ పై మాజీ సీఎం కుమార స్వామి నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా సరిహద్దు సమస్య చాలా స్పష్టంగా ఉంది. తాము మా నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని వారికి కూడా తెలుసు అన్నారు సీఎం బొమ్మై. తమ రాజకీయ చర్యలలో ఈ భాషా ద్వేషాన్ని ఉపయోగించవద్దని కోరుతున్నానని తెలిపారు.
Also Read : పంజాబ్ లో కంట్రోల్ తప్పిన లా అండ్ ఆర్డర్