Sidhu : ప్రశాంత్ కిషోర్ కు సిద్దూ కంగ్రాట్స్

నా పాత స్నేహితుడికి అభినంద‌న‌లు

Sidhu : త్వ‌ర‌లో త‌న మాతృభూమి వేదిక నుంచి కొత్త ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేయ‌నున్న‌ట్లు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌బోతున్నారా లేక వేరే పార్టీతో జ‌త క‌డ‌తారా అన్న‌ది తేలాల్సి ఉంది.

ఇప్ప‌టి దాకా ఆయ‌న టీఎంసీ, బీజేపీ, డీఎంకే, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, ఆప్ ల‌తో క‌లిసి ప‌ని చేశారు. ఇవ‌న్నీ కేవ‌లం రాష్ట్రాల‌కు చెందిన‌వి మాత్ర‌మే. ఆయ‌న చేసిన స‌ర్వేల‌లో 90 శాతం స‌క్సెస్ రేటు ఉండ‌గా 10 శాతం వ్య‌తిరేక ఓటు ఉంది.

ఈ త‌రుణంలో ఆయ‌న ఇటీవ‌ల ఢిల్లీలో మేడం సోనియా గాంధీని ప‌లుమార్లు క‌లిశారు. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీకి బ్లూ ప్రింట్ అంద‌జేశారు. ప‌నిలో ప‌నిగా పవర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ ను పార్టీలోకి రావాలంటూ ఏఐసీసీ కోరింది.

కానీ పీకే తిర‌స్క‌రించారు. ఇదే స‌మ‌యంలో పీకే తాను కాంగ్రెస్ తో జ‌త క‌ట్ట‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్ , మాజీ క్రికెట‌ర్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ (Sidhu)సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

కొత్త ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్ట‌నున్న త‌న పాత మిత్రుడు ప్ర‌శాంత్ కిషోర్ ఆశ‌లు నెర‌వేరాల‌ని, స‌క్సెస్ సాధించాల‌ని సిద్దూ కోరారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : లౌడ్ స్పీక‌ర్ల‌ను తీసేయ‌క పోతే యుద్ద‌మే

Leave A Reply

Your Email Id will not be published!