Parag Agarwal : ట్విట్ట‌ర్ సిఇఓపై వేటుకు వేళాయె

ట్విట్ట‌ర్ సిఇఓపై ఎలోన్ మ‌స్క్ అసంతృప్తి

Parag Agarwal : ప్ర‌పంచ కుబేరుడు టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ 44 బిలియ‌న్ల‌కు ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాడు. ఈ త‌రుణంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జంగా పేరున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ను స్వంతం చేసుకున్నాడు.

ఈ త‌రుణంలో భార‌త్ కు చెందిన ప‌రాగ్ అగ‌ర్వాల్ (Parag Agarwal) సిఇఓ గా ఉన్నారు. ట్విట్టర్ ను ఎలోన్ మ‌స్క్ స్వంతం చేసుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు స‌ర్వాధికారాలు రావాలంటే ఇంకా ఆరు నెల‌ల పాటు వేచి చూడాల్సిందే.

ఎలోన్ మ‌స్క్ మొద‌టి నుంచీ ట్విట్ట‌ర్ సిఇఓపై గుర్రుగా ఉన్నారు. ఈ త‌రుణంలో ప‌రాగ్ అగ‌ర్వాల్ ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతూ, లూజ్ కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నాడు ఎలోన్ మ‌స్క్.

అంతే కాదు అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చులు, ఉద్యోగుల కోత‌పై కూడా ఫోక‌స్ పెట్టాల‌ని ఇప్ప‌టికే ఆయ‌న ఆదేశించారు. ఇక ఎలోన్ మ‌స్క్ తో సంప్ర‌దించ‌కుండా ప్ర‌స్తుత సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ ట్విట్ట‌ర్ లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌తో మాట్లాడ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు టెస్లా సిఇఓ.

అదే ఆయ‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. కాగా ట్విట్ట‌ర్ ఒప్పందం ప్ర‌కారం త‌నంత‌కు తాను త‌ప్పుకున్నా లేదా మేనేజ్ మెంట్ త‌ప్పించినా భారీగా ప‌రాగ్ అగ‌ర్వాల్ కు స‌మ‌ర్పించు కోవాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించి యుకెకు చెందిన న్యూస్ ఏజెన్సీ రాయిట‌ర్స్ ఓ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించింది. ఇందులో ట్విట్ట‌ర్ సిఇఓను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయిందంటూ స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

Also Read : రూ. 5, 551 కోట్ల షావోమీ ఆస్తులు జ‌ప్తు

Leave A Reply

Your Email Id will not be published!