PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి యూరప్ టూర్ లో భాగంగా జర్మన్ రాజధాని బెర్లిన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం లభించింది.
ప్రవాస భారతీయులు ఆయనను చూసేందుకు, కలిసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi)చిన్నారులతో ముచ్చటించారు. వారు ఆయన పట్ల చూపిన ప్రేమకు పొంగి పోయారు.
మీ ఆదరాభిమానాలను మరిచి పోలేనని పేర్కొన్నారు మోదీ. ఇదే సమయంలో భారతీయ బాలుడు వందేమాతరం, జనగణమన గీతాన్ని అద్భుతంగా ఆలాపించాడు.
మోదీ ఆ పిల్లాడిని ఆప్యాయంగా పలకరించి, అతడి లోని దేశ భక్తికి ప్రధాని విస్తు పోయారు. ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రవాస భారతీయులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ భారతీయ మూలాలు మరిచి పోవడం లేదన్నారు.
ఇది భారతీయ సంస్కృతి, సాంప్రదాయం పట్ల భారతీయులకు ఉన్న నిబద్దత, గౌరవం ఏమిటో తెలియ చేస్తుందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
సమున్నత భారతావని ఇవాళ సగర్వంగా తలెత్తుకుని నిలిచి ఉన్నదంటే కారణం మీలాంటి వారి వల్లనేనని కొనియాడారు. భారతీయతను కాపాడు కోవడం ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు.
ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడికి వెళ్లినా భారత మాతను మరిచి పోకూడదని హితవు పలికారు. మన దేశం సాధించిన ప్రగతిని గుర్తించాలని, దాని గురించి నలుదిశలా తెలియ చేయాలని పిలుపునిచ్చారు మోదీ.
Also Read : యుద్దానికి వ్యతిరేకం శాంతి మా అభిమతం