Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi )నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఏడున్నర ఏళ్ల పాలనలో మోదీ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు.
పెరిగిన విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగం తప్ప ఇంకేమీ లేదన్నారు. డిజిటల్ ఇండియా పేరుతో జనాన్ని మోసం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు.
మన్ కీ బాత్ పేరుతో చిలుక పలుకులు పలుకుతూ కాలం వెలిబుచ్చుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పరిపాలనా పరంగా పూర్తిగా అట్టడుగున ఉన్నారంటూ సీరియస్ అయ్యారు.
తమ హయాంలో ప్రభుత్వ ఆస్తులను పోగేసి, కాపాడుకుంటూ వస్తే మోదీ హయాంలో వాటిని అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధి. ఇందు కోసమేనా ప్రజలు మోదీని ఎన్నుకుందని ప్రశ్నించారు.
ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందన్నారు. ఒక రకంగా దీనిపై యూనివర్శిటీలు, మేధావులు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ.
ఒక బలమైన వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానిపై స్టడీ చేయాలంటే యూనివర్శిటీలకు వెళ్లాల్సిన పని లేదని కేవలం మోదీ ప్రభుత్వాన్ని చూస్తే చాలంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు.
విద్యుత్ సంక్షోభానికి ప్రస్తుత పాలకవర్గమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). బొగ్గు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత పీఎంపై ఉందన్నారు.
Also Read : జిగ్నేష్ కేసులో ఖాకీల తీరుపై కోర్టు కన్నెర్ర