Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మరోసారి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ దేశాన్ని విభజించి పాలిస్తోందని ఆరోపించారు.
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ ) సందర్బంగా మంగళవారం కోల్ కతా లోని రెడ్ రోడ్ వద్ద ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదర సోదరీమణులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
ఆమె మోదీపై నిప్పులు చెరిగారు. మత సామరస్యం విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు మమతా బెనర్జీ. బెంగాల్ లో నెలకొన్న ఐక్యత, దేశంలో మరే ఇతర ప్రాంతం అలాంటి ఉదాహరణ చూపడం లేదన్నారు.
అందుకే వారు మమ్మల్ని అసూయ పడుతారని , దుర్బాష లాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఉన్న ప్రజల మధ్య కుల, మతాల పేరుతో విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ తో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వేదికను పంచు కోవడం విశేషం. దేశంలో వాతావరణం బాగా లేదు. విభజించి పాలించే విధానం మంచిది కాదన్నారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
మనకు ఐక్యతతో ఉండాలి. భయపడకండి నేను మీకు ఉన్నా. మీపై ఆధిపత్యం వహించే వారి పట్ల జాగ్రత్తగా ఉండడని, పోరాడాలని పిలుపునిచ్చారు సీఎం. అల్లాహ్ తేరో నామ సబ్ కో సమ్మతి దే భగవన్ అని సంబోదించింది.
బీజేపీకి ఎన్నికలప్పుడే మనుషులు గుర్తుకు వస్తారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : కర్ణాటక సీఎం మార్పుపై యెడ్డీ క్లారిటీ