US VISA : ప్రవాస భారతీయులకు తీపి కబురు అందించింది యుఎస్ ప్రభుత్వం. వీరిందరికీ ఊరట ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పర్మిట్ వీసాల గడువును 18 నెలల పాటు పెంచింది.
ఈ పెంపు కొన్ని ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారితో పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (ఈఏడీ) కలిగిన హెచ్ 1బి వీసాదారులు (US VISA )కలిగిన వారికి వర్తిస్తుందని తెలిపింది.
ఈ కీలక నిర్ణయం ఇవాల్టి నుంచి 4 నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా ఈఏడీలో గడువు ముగిసిన తర్వాత కూడా 180 రోజుల వరకు వాటిని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
దానిని 540 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యుఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల పరంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ సర్కార్(US VISA )వెల్లడించింది.
వీటి వల్ల పని పర్మిషన్ కోసం పొందే వీలు కలుగుతుంది. 87 వేల మంది వలసదారులకు తక్షణమే మేలు చేకూరనుంది. 4 లక్షల 20 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు తమ పని అనుమతులు కోల్పోకుండా ఉద్యోగాల్లో కొనసాగవచ్చని వెల్లడించింది.
చాలా కంపెనీలు ఉద్యోగుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ గడువు పెంపొందించడం వల్ల ఆయా సంస్థలకు మరింత మేలు చేకూరుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అమెరికాలో అత్యధిక కంపెనీలలో ఎన్నారైలే ఎక్కువగా పని చేస్తున్నారు. టాప్ కంపెనీలను నడుపుతున్న వారిలో మన వాళ్లే ఉన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల వారికి మేలు కలిగించేదిగా ఉందనడంలో సందేహం లేదు.
Also Read : ‘తానా కవితాలహరి’ కి రామనాథం నాయుడు