Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
దేశంలో కరోనా మహమ్మారి తగ్గిన వెంటనే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు.
కొత్త పౌరసత్వ చట్టాన్ని తాము అమలు చేయబోవడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆమె చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మండిపడ్డారు.
ఆరు నూరైనా సరే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కావడం ఖాయమన్నారు. కోవిడ్ తగ్గిన వెంటనే ఇది అమలులోకి వస్తుందన్నారు.
వివాదాస్పద పౌరసత్వ చట్టం కేంద్రం ఎజెండాలో తిరిగి చేర్చడం జరిగిందన్నారు అమిత్ షా(Amit Shah ). ఉత్తర బెంగాల్ లోని సిరిగురిలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు.
కొత్త పౌరసత్వ చట్టం గురించి లేనిపోని అబద్దపు ప్రచారాన్ని కావాలని సీఎం మమతా బెనర్జీ చేస్తోందంటూ ధ్వజమెత్తారు. వాళ్లు అనుకున్నట్టు అదేమీ కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో అమలు కావడం ఖాయమన్నారు.
కోవిడ్ వేవ్ ప్రస్తుతం నడుస్తోంది. అందుకోసమే కేంద్ర సర్కార్ వేచి చూసే ధోరణి అవలంభిస్తోందన్నారు. ఇది తగ్గిన వెంటనే సీఏఏ అమలు చేయడం పక్కా అని ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.
ఒక్కసారి అడుగు వేశామంటే వెనక్కి తిరిగే ప్రసక్తి లేదన్నారు అమిత్ షా.
Also Read : ‘చాలీసా’కు లౌడ్ స్పీకర్లు ఎందుకు