NV Ramana : బ్యూరోక్రాట్ల‌పై పెత్త‌నంపై సుప్రీం విచార‌ణ

కేంద్ర ప్ర‌భుత్వానిదా లేక ఢిల్లీ స‌ర్కార్ దా

NV Ramana : దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్యూరోకాట్ల ను ఎవ‌రు నియంత్రించాల‌నే దానిపై భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం విచార‌ణ చేప‌ట్టింది. దీనికి సంబంధించి రాజ్యాంగ ధ‌ర్మాసనానికి రెఫ‌ర్ చేసింది.

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్( NV Ramana )నేతృత్వంలోని ధ‌ర్మాసనం తీర్పు చెప్పేందుకు సిద్ద‌మైంది. కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉంది.

ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప‌వ‌ర్ లో కొన‌సాగుతోంది. ఆప్, బీజేపీల మ‌ధ్య నువ్వా నేనా అన్న పంచాయ‌తీ మొద‌లైంది. కేంద్రం కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతోందంటూ ఆప్ ఆరోపిస్తోంది.

కాదు త‌మ‌కు అధికారం ఉందంటూ ప్ర‌గల్భాలు ప‌లుకుతోంది కేంద్రం. అయిన దానికి కాని దానికి గిల్లి క‌జ్జాలు పెట్టుకుంటోంది కేంద్ర స‌ర్కార్. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌న్ని ఇప్పుడు మోదీపై క‌న్నెర్ర చేస్తున్నాయి.

ఇక ఆయా రాష్ట్రాల‌లో సీఎంలు, గ‌వ‌ర్న‌ర్ల‌కు ప‌డ‌డం లేదు. ఈ త‌రుణంలో ఢిల్లీలో ఆప్ పై పెత్త‌నం చెలాయించేందుకు కేంద్రం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కు స‌ర్వాధికారాలు క‌ట్టబెడుతూ తీర్మానం చేసింది.

దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది ఢిల్లీ స‌ర్కార్. ఇక బ్యూరోకాట్ల నియంత్ర‌ణ‌పై కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌ధ్య నెల‌కొన్న వాగ్వాదానికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు శుక్ర‌వారం రాజ్యాంగ ధ‌ర్మాసానికి రిఫెర్ చేసింది.

ఆర్టిక‌ల్ 239 ఏఏ ఢిల్లీ ప్ర‌భుత్వం శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క అధికారాల‌ను వివ‌రిస్తుంది. అదే స‌మ‌యంలో భూమి, పోలీసు, పబ్లిక్ ఆర్డ‌ర్ అనే అంశాలు రాజ‌ధానిలోని కేంద్రం ప్ర‌త్యేక డొమైన్ లో ఉంఆయి.

న్యాయ‌మూర్తులు సూర్య‌కాంత్ , హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈనెల 11న త‌దుప‌రి విచార‌ణ చేప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌ మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!