Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తాము మొదటి నుంచీ మొత్తుకుంటూ వస్తున్నామని కానీ వినిపించు కోలేదన్నారు.
కరోనా చావుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనన్న విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడైందన్నారు. ఇప్పుడైనా కాషాయ పార్టీ తప్పు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.
ఇకనైనా మీరు చేసిన తప్పిదాలకు ప్రాయచిత్తం చేసుకోండి. కరోనా కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోండి. అనాధలైన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజాగా డబ్ల్యుహెచ్ఓ ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య, చని పోయిన వారి సంఖ్య దేశాల వారీగా నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టులో అత్యధికంగా చని పోయిన వారి సంఖ్య భారత్ లోనే ఉందని కుండ బద్దలు కొట్టింది.
దీనిని తీవ్రంగా తప్పు పట్టింది కేంద్ర ప్రభుత్వం. కాగా రాహుల్ గాంధీ (Rahul Gandhi )శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై స్పందించారు.
ఈ ప్రభుత్వం పాలనా పరంగా ఫెయిల్ అయ్యిందని, కరోనాను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. వ్యాపారులు, బడా బాబులకు మేలు చేకూర్చేందుకే మోదీ పని చేస్తున్నారంటూ మండి పడ్డారు.
ఈ నివేదికపై ఏం సమాధానం చెబుతారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
ఇకనైనా చేసిన తప్పు ఒప్పుకోవాలని సూచించారు మోదీకి. ప్రభుత్వం చెప్పినట్లు 4.7 లక్షల మంది చని పోలేదని ఏకంగా 47 లక్షల మంది చని పోయారని ఆయన పేర్కొన్నారు.
Also Read : బీజేపీ నేత తజిందర్ బగ్గా అరెస్ట్