Rakesh Tikait : రైతు బాంధవుడు అజిత్ సింగ్ : తికాయత్
రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్
Rakesh Tikait : ఈ దేశం గర్వించ దగిన నాయకులలో మాజీ కేంద్ర మంత్రి చౌదరి అజిత్ సింగ్ అని పేర్కొన్నారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్.
ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా అజిత్ సింగ్ కు నివాళులు అర్పించారు తికాయత్(Rakesh Tikait). ఈ సందర్భంగా రైతు ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు అజిత్ సింగ్ అని. పార్లమెంట్ లో రైతుల గొంతుకను వినిపించారని పేర్కొన్నారు. ఆయన అందించిన స్పూర్తితోనే తాము దేశంలో రైతు ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం నడిపంచామని చెప్పారు.
తనకు అత్యంత ఆప్తుడిగా ఎన్నో సలహాలు, సూచనలు అందజేశారని, ఉద్యమాన్ని ఎలా నడపాలో ఎక్కడ తగ్గాలో కూడా చెప్పారని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా రాకేశ్ తికాయత్(Rakesh Tikait). రైతులకు, దేశానికి ఆయన లేని లోటు పూడ్చ లేనిదన్నారు.
రైతు ఉద్యమాలకు అజిత్ సింగ్ అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు రాకేశ్ తికాయత్. తన జీవిత కాలంలో ఎక్కువగా ప్రజా సమస్యల కోసం నినదించారని ప్రశంసించారు.
ఆయన కరోనా సోకి ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా రైతు ఉద్యమం ఎలా జరుగుతోందంటూ ఆరా తీశారని ఇది ఆయనకు ఉన్న నిబద్దతను తెలియ చేస్తుందన్నారు.
ఉద్యమం చివరి దశలో ఉన్న సమయంలో ఆయనను కోల్పోవడం బాధాకరమన్నారు రాకేశ్ తికాయత్. ఇవాళ ఆయన చని పోయి ఏడాది అవుతోందంటే నమ్మ బుద్ది కావడం లేదన్నారు రైతులు. ఆయనకు కన్నీటి నివాళులు అర్పించారు.
Also Read : కరోనా మరణాల నివేదికపై కేంద్రం గుస్సా