Amit Shah : బీజేపీ నాయకుడి మృతిపై సీబీఐ విచారణ
బీజేపీ నాయకుడి మరణంపై సీబీఐతో విచారణ చేపట్టాలని అమిత్ షా పిలుపు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా
Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో ఉండగానే బీజేపీ యువజన విభాగానికి చెందిన అర్జున్ చౌరాసియా ఉత్తర కోల్ కతాలోని తన ఇంటికి సమీపంలోని పాడు బడిన భవనంలో ఉరి వేసుకుని చని పోయాడు.
దీనిపై అమిత్ షా(Amit Shah)స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. బీజేపీ నాయకుడి మరణంపై సీబీఐతో విచారణ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మరణం ఫ్లాష్ పాయింట్ గా మారాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న స్థితికి చేరుకున్నాయి విభేదాలు. ఇప్పటికే పలు ఘటనలు చోటు చేసుకున్నాయి.
కోర్టుల దాకా వెళ్లాయి. ఇదిలా ఉండగా అమిత్ షా(Amit Shah)స్వాగతానికి ఉద్దేశించిన ఈవెంట్ లో ఒక దానిలో శుక్రవారం బైక్ ర్యాలీకి నాయకత్వం వహించాల్సి ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయనను హత్య చేసిందంటూ బీజేపీ ఆరోపించింది.
దీనిని టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బీజేపీ యువ మోర్చా నాయకుడు చౌరసియా హత్య వెనుక ఎవరు ఉన్నా వారిని కఠినంగా శిక్షిస్తాం.
ఈ రాజకీయ హింసపై కేంద్ర హొం మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరామన్నారు అమిత్ షా.
గత సంవత్సరం రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓడి పోయాక అమిత్ షా మొదటిసారి బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చకు దారి తీసింది.
Also Read : Rakesh Tikait : రైతు బాంధవుడు అజిత్ సింగ్ : తికాయత్