Nitish Kumar : పీకేపై నితీష్ కుమార్ ఫైర్

ఆయ‌న అభిప్రాయం ప్రామాణికం కాదు

Nitish Kumar :  బీహార్ లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఇండియ‌న్ పొలిటికల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ అక్టోబ‌ర్ 2న చంపార‌న్ నుంచి 3,000 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మస్య‌లు ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న బీహార్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై సీఎం నితీశ్ కుమార్ సీరియ‌స్ అయ్యారు. ఒకరి అభిప్రాయం ప్రామాణికం కాద‌న్నారు. పీకే తీరుపై మండిప‌డ్డారు. శుక్ర‌వారం సీఎం మీడియాతో మాట్లాడారు.

బీహార్ లో మంచి చేశామా లేదా అన్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ఎవ‌రో చెబితే వాళ్లు వినే ప‌రిస్థితిలో లేరన్నారు. త‌మ ప‌నితీరు గురించి ఇంకొక‌రు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఏది స‌త్యం ఏది ముఖ్యం..అవ‌స‌రం అనేది జ‌నానికి బాగా తెలుస‌న్నారు. రాజ‌కీయాలు వేరు వ్యూహాలు వేరు. అభిప్రాయాలు వేరు. వాటినే మ‌నం గొప్ప‌గా ఊహించుకుంటే మిగిలేది విషాద‌మేన‌ని పీకేను ఉద్దేశించి పేర్కొన్నారు నితీష్ కుమార్.

ఇదిలా ఉండ‌గా ప్ర‌శాంత్ కిషోర్ బీహార్ లో 15 ఏళ్ల పాల‌న గురించి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పున‌రుద్ద‌రించేందుకు కొత్త ఆలోచ‌న రావాల‌ని కొత్త ప్ర‌య‌త్నం అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మీకంతా తెలుసంటూ మీడియాకే వ‌దిలి పెట్టారు సీఎం. వాస్త‌వాలు బ‌య‌ట అగుపిస్తున్న‌ప్పుడు ఇంకొక‌రి గురించి , వారి అభిప్రాయాల గురించి ఎందుకు మాట్లాడాల‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్న వేశారు. నితీష్ కుమార్ పై పీకే నిప్పులు చెరిగారు.

Also Read : బీజేపీ నాయ‌కుడి మృతిపై సీబీఐ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!