Sidhu : ‘బ‌గ్గా’ అరెస్ట్ పై భ‌గ్గుమ‌న్న సిద్దూ

రాజ‌కీయ క‌క్ష సాధింపు ధోర‌ణి ఇది

Sidhu : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ(Sidhu) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కుడు తజీంద‌ర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఆప్ అనుస‌రిస్తున్న తీరుపై మండిప‌డ్డారు సిద్దూ(Sidhu). ఇదిలా ఉండ‌గా బ‌గ్గాను ఉదయం 8.30 గంట‌ల స‌మ‌యంలో పంజాబ్ పోలీసులు 50 మంది వ‌చ్చి ఎత్తుకెళ్లారంటూ ఆరోపించారు.

బీజేపీ ఢిల్లీ అధికార ప్ర‌తినిధి న‌వీన్ కుమార్ జిందాల్. ఇదిలా ఉండ‌గా బ‌గ్గాను తీసుకు వెళుతుండ‌గా హ‌ర్యానాలో నిలిపి వేశారు అక్క‌డి పోలీసులు. హ‌ర్యానాలో ఉన్న‌ది బీజేపీ ప్ర‌భుత్వం.

త‌న త‌ల పాగా ధ‌రించ‌కుండా పోలీసులు అడ్డుకున్నారంటూ జిందాల్ మండిప‌డ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై సిద్దూ సీరియ‌స్ గా స్పందించాడు.

పంజాబ్ పోలీసుల‌కు ఉన్న గౌర‌వాన్ని పంజాబ్ , ఢిల్లీ సీఎంలు భ‌గ‌వంత్ మాన్, కేజ్రీవాల్ మంట గ‌లుపుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. వ్య‌క్తిగ‌త ద్వేషాల‌ను, క‌క్ష‌ల‌ను ఇలా తీర్చుకుంటారా అని ప్ర‌శ్నించారు సిద్దూ.

త‌జింద‌ర్ బ‌గ్గా వేరే పార్టీకి చెందిన వ్య‌క్తి కావ‌చ్చు. సైద్దాంతిక విభేదాలు ఉండ‌వ‌చ్చు. కానీ ఇలాగేనా అరెస్ట్ చేసే ప‌ద్ద‌తి అని నిల‌దీశారు. ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఎలా ప‌ట్టుకు వెళ‌తార‌ని ప్ర‌శ్నించారు సిద్దూ.

త‌న కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ బ‌గ్గా తండ్రి ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ నుండి మొహాలీకి తీసుకు వచ్చే వాహ‌నాల‌ను హ‌ర్యానాలోని కురుక్షేత్ర‌లో నిలిపి వేశారు. అయితే పంజాబ్ పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆప్ నేత‌లు పేర్కొన్నారు.

Also Read : రైతు బాంధవుడు అజిత్ సింగ్ : తికాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!