Bojjala GopalaKrishna Reddy : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి(Bojjala GopalaKrishna Reddy)కన్నుమూశారు. శుక్రవారం అపోలో ఆస్పత్రిలో చొకిత్స పొందుతూ గుండె పోటు రావడంతో మృతి చెందారు.
కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఏపీలోని శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకు స్థాయి మినిష్టర్ గా పని చేశారు.
1949 ఏప్రిల్ 15న ఊరందూరులో పుట్టారు. ఆయనకు 73 ఏళ్లు. భార్య బృంద, కూతురు పద్మ, కొడుకు సుధీర్ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆయన పేరు మోసిన రాజకీయ నాయకుడు.
సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. టీడీపికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీకాళహస్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆయన ఊరు. ఆయన తండ్రి గంగ సుబ్బ రామి రెడ్డి కూడా శ్రీకాళహస్తికి ఎమ్మెల్యేగా పని చేశారు.
శ్రీ వేంటకేశ్వర విశ్వ విద్యాలయం నుంచి 1968లో బీఎస్సీ చేశారు. 1972లో లా పట్టా పుచ్చుకున్నారు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి(Bojjala GopalaKrishna Reddy). వివాహం అయ్యాక లా ప్రాక్టీసు చేసేందుకు హైదరాబాద్ కు వచ్చారు.
తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1989లో శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు.
1994-2004 మధ్య కాలంలో చంద్ర బాబు నాయుడు మంత్రి వర్గంలో ఐటీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పని చేశారు.
2004లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడి పోయారు. 2009 ఎన్నికల్లో గెలుపొందారు బొజ్జల.
Also Read : రియాల్టీ షోలపై హైకోర్టు ఆగ్రహం