Noida CEO : నోయిడా సిఇఓకు సుప్రీంకోర్టు షాక్
ఆలస్యంగా కోర్టుకు చేరుకున్న వైనం
Noida CEO : ఆలస్యంగా కోర్టుకు చేరినందుకు నోయిడా సిఇఓపై(Noida CEO) సుప్రీంకోర్టు వారెంట్ ను రద్దు చేసింది. రీతూ మహేశ్వరి పై నాన్ బెయిలబుల్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నిరాకరించారు.
రీతూ మహేశ్వరిపై అలహాబాద్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ పై స్టే విధించింది. కోర్టు ధిక్కారం కింద నోయిడా సిఇఓ రీతూ మహేవ్వరిపై కోర్టు జారీ చేసిన నాన్ బెయిల్ వారెంట్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఈ వ్యాజ్యాన్ని రేపు విచరాణకు లిస్టు చేసింది. కోర్టు ధిక్కార కేసులో నిర్ణీత సమయానికి కోర్టుకు చేరుకోలేదు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి తదపురి విచారణ కోసం ఈనెల 13న కోర్టులో హాజరు పర్చాలని అలహాబాద్ హైకోర్టు మే5న పోలీసులను ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్ ) అధికారిణి అయిన మహేశ్వరిపై(Noida CEO) నాన్ బెయిలబుల్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నిరాకరించారు.
ప్రధాన నయాయమూర్తి మహేశ్వరి పిటిషన్ ను జాబితా చేయాలా వద్దా అని నిర్ణయించే ముందు దానిని సరిగా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నోయిడా సిఇఓ(Noida CEO) కోర్టు ఆదేశాలను గౌరవించడం లేదంటూ విమర్శించారు.
ఐఏఎస్ అధికారిణిగా ఆమెకు రూల్స్, చట్టాలు తెలుసు. కోర్టు ఆదేశాలను గౌరవించకుంటే శిక్ష తప్పదు. అలహాబాద్ హైకోర్టులో ఇలా జరగడం రోజూ చూస్తూనే ఉన్నాం.
ఎవరో ఒకరు వస్తున్నారు. కోర్టును ధిక్కరించినందుకు ఉపశమనం కోసం తమ కోర్టు ముందుకు రావడం మామూలై పోయిందని మండిపడ్డారు ఎన్వీ రమణ.
Also Read : రుణం తీర్చుకోండి పార్టీని గెలిపించండి