Chittoor SP : అడ్మిష‌న్లు పెంచేందుకే పేప‌ర్ లీక్

చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్ల‌డి

Chittoor SP : ఏపీలో తీవ్ర సంచ‌ల‌నం రేపిన 10వ త‌ర‌గ‌తి పేప‌ర్ లీకు వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. ఈ ఘ‌ట‌నలో కీల‌క సూత్ర‌ధారిగా ఉన్నారంటూ నారాయ‌ణ గ్రూప్ సంస్థ‌ల గౌర‌వ చైర్మ‌న్, మాజీ మంత్రి నారాయ‌ణ‌ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

హైద‌రాబాద్ లోని ఐకియా ద‌గ్గ‌ర నారాయ‌ణ‌, త‌న భార్య‌తో బెంజ్ కారులో వెళుతుండ‌గా మాటు వేసి ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ కేసుకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు.

టెన్త్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లీక కేసులో మాజీ మంత్రి నారాయ‌ణ ప్ర‌మేయం ఉండ‌డం వ‌ల్లే అదుపులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు. నారాయ‌ణ స్కూళ్ల‌లో అడ్మిష‌న్లు పెంచేందుకే ఎస్ఎస్సీ పేప‌ర్ లీక్ చేశారంటూ వెల్ల‌డించారు.

ఆయ‌న‌ను ఎందుకు అరెస్ట్ చేశామ‌న్న దానిపై కూడా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు(Chittoor SP). 10వ త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ కేసులో నారాయ‌ణ‌ను అరెస్ట్ చేశామ‌ని చెప్పారు. ఆయ‌నను హైద‌రాబాద్ లో అదుపులోకి తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.

ఏప్రిల్ 27న 10 పేప‌ర్ మాల్ ప్రాక్టీస్ జ‌రిగింద‌న్నారు. ఇందుకు సంబంధించి చిత్తూరు పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది(Chittoor SP). ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశామ‌ని తెలిపారు.

నిందితులకు సంబంధించిన లింకులో చైర్మ‌న్ నారాయ‌ణ వ‌ర‌కు ఆధారాలు ల‌భించాయ‌ని స్ప‌ష్టం చేశారు ఎస్పీ(Chittoor SP). నారాయ‌ణ స్కూళ్ల‌లో అడ్మిష‌న్లు పెంచేందుకే పేప‌ర్ లీక్ , ఇన్విజిలేట‌ర్ల వివ‌రాలు ముందుగానే తీసుకుని ఈ త‌తంగాన్ని న‌డిపార‌ని అన్నారు.

విద్యార్థులు ఎక్క‌డ ఎగ్జామ్స్ రాస్తారో తెలుసుకుని హెడ్ ఆఫీస్ నుంచి కీ త‌యారు చేసి విద్యార్థుల‌కు పంపుతార‌ని తెలిపారు.

నారాయ‌ణ‌తో పాటు నారాయ‌ణ సంస్థ‌ల డీన్ బాల గంగాద‌ర్ ను అరెస్ట్ చేశామ‌న్నారు. నిందితుల వాంగ్మూలం, టెక్నిక‌ల్ ఆధార‌ల‌తో నారాయ‌ణ‌ను అరెస్ట్ చేశామ‌న్నారు.

 

Also Read : అస‌ని తుపాను ఎఫెక్ట్ వైజాగ్ పోర్ట్ క్లోజ్

Leave A Reply

Your Email Id will not be published!