Marcos JR : ఫిలిప్పీన్స్ ఎన్నిక‌ల్లో మార్కోస్ విక్ట‌రీ

ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరుపై జనాగ్ర‌హం

Marcos JR : యావ‌త్ ప్ర‌పంచం అత్యంత ఆస‌క్తితో ఎదురు చూసిన ఫిలిప్పీన్స్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మార్కోస్ జూనియ‌ర్ సంచ‌ల‌న విజ‌యం నమోదు చేశారు. ఫెర్టినాండ్ మార్కోస్ జూనియ‌ర్(Marcos JR) 30.8 మిలియ‌న్ల కంటే ఎక్కువ ఓట్ల‌ను సాధించారు.

దీంతో మార్కోస్ రాజ వంశం తిరిగి అధికారంలోకి వ‌స్తుంది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు వ్య‌తిరేకంగా వేలాది మంది నిర‌స‌న తెలిపారు. ప‌దవీచ్యుతుడైన నియంత త‌న‌యుడు మార్కోస్ ఘ‌న విజ‌యం సాధించ‌డం విస్తు పోయేలా చేసింది.

ఓటింగ్ యంత్రాలు ప‌ని చేయ‌క పోడ‌డంతో వేలాది మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగంచు కోలేక పోయారు. ఇదే విష‌యాన్ని వారు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా న్నిక‌ల క‌మిష‌న్ (కామెలెక్) ఓటింగ్ స‌మ‌యాన్ని పొడిగించాల‌నే డిమాండ్ ను తిర‌స్క‌రించింది. విజ‌యం సాధించిన అనంత‌రం మార్కోస్ జూనియ‌ర్(Marcos JR) ప్ర‌సంగించారు.

ఎక్క‌డా అక్ర‌మాల‌కు తావు లేకుండా పూర్తిగా ప్రజాస్వామ్య ప‌ద్ద‌తిలో ఎన్నిక‌లు జ‌రిగాయి. నిర‌స‌న తెలియ చేయ‌డం అన్న‌ది ప్రాథ‌మిక హ‌క్కు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాలి. ప్ర‌జాభీష్టం స్ప‌ష్టంగా వెల్ల‌డైంది.

ఇది వాస్త‌వం. దేశంలో కొన్ని చోట్ల అస్థిర‌త ఉన్న‌ప్ప‌టికీ పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగింద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. 2,00 ఓట్ల లెక్కింపు యంత్రాలు ప‌ని చేయ‌లేదు.

విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. ఓట‌ర్ల జాబితాల్లో పేర్లు గ‌ల్లంత‌య్యాయి. పోలింగ్ శాతం ఎక్కువ‌గానే జ‌రిగింద‌ని వెల్ల‌డించింది. ఇక మార్కోస్ జూనియ‌ర్(Marcos JR) పై పోటీ చేసిన వైస్ ప్రెసిడెంట్ లెని రోబ్రెడోకు 14.7 మిలియ‌న్ ఓట్లు పోల్ అయ్యాయి.

రోబ్రెడో ఓట‌మిని అంగీక‌రించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓట‌మి చెందినంత మాత్రాన ప్ర‌జ‌ల స్వ‌రం వినిపించ‌ద‌ని అనుకుంటే పొర‌పాటు. మిలియ‌న్ల మంది న‌న్ను న‌మ్మారు. వారి స్వ‌రం మ‌రింత బ‌ల‌ప‌డ‌నుంద‌ని తేలింద‌న్నారు.

 

Also Read : నేవీ స్థావ‌రంలో దాచుకున్న రాజ‌ప‌క్స‌

Leave A Reply

Your Email Id will not be published!