Tajinder Bagga : అదరను బెదరను ప్రశ్నిస్తూనే ఉంటా
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బగ్గా సవాల్
Tajinder Bagga : భారతీయ జనతా పార్టీ నాయకుడు తజీందర్ పాల్ సింగ్ బగ్గా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు.
ఇంకా ఎన్ని కేసులు పెడతారో జనానికి చెప్పాలన్నాడు. నాపై 1000 కేసులు నమోదు చేసినా తాను బెదరనని కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.
ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు బగ్గా(Tajinder Bagga). గురుగ్రంథ సాహిబ్ పై హత్యా కాండ, మాదక ద్రవ్యాల మాఫియా, నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆప్ కన్వీనర్ తాను అడిగినందుకు, నిలదీసినందుకే తనపై కేసులు బనాయించారంటూ ఆరోపించారు.
అయినా తాను బెదిరే ప్రసక్తి లేదన్నారు. అరెస్ట్ లకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. ఢిల్లీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. మరి ఎందుకు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారిని పట్టు కోవడం లేదంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో వేర్పాటువాదులు ఖలిస్తాన్ నినాదాలు చేస్తున్నారు. మరి పంజాబ్ సిఎం భగవంత్ మాన్ నిద్ర పోతున్నారా అని నిలదీశారు బగ్గా.
ఎన్ని కేసులు బనాయించినా, అరెస్ట్ చేసినా, లేదా అభియోగాలు మోపినా తాను ప్రశ్నించడం మానుకోనని మరోసారి కుండబద్దలు కొట్టారు.
నేను ఏ దేశ ద్రోహానికి పాల్పడలేదు. నన్ను ఓ టెర్రరిస్టులా అరెస్ట్ చేశారు. గురుగ్రంథ సాహిబ్ పై హత్యా యత్నానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేస్తానని గతంలో ప్రకటించారు కేజ్రీవాల్.
మరి వారి పార్టీనే పవర్ లో ఉంది. ఆ పని ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తజీందర్ సింగ్ బగ్గాను జూలై 5 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హర్యానా, పంజాబ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది పంజాబ్ సర్కార్ కు.
Also Read : నోరు జారిన సీఎం అమిత్ షానే పీఎం