Nana Patole : శరద్ పవార్ పై నానా పటోలే కన్నెర్ర
కాంగ్రెస్ కు ఎన్సీపీ వెన్నుపోటు
Nana Patole : మహారాష్ట్రలో రాజకీయం మరింత వేడెక్కింది. కేంద్రం వర్సెస్ బీజేపీ మధ్య నిన్నటి దాకా మాటల యుద్ధం నడించింది. ఇక హనుమాన్ చాలీసా సమస్య ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే వర్సెస్ సీఎం ఉద్దవ్ థాకరే మధ్య నడించింది.
వాటిని మరిచి పోక ముందే సంకీర్ణ సర్కార్ మహా వికాస్ అగాధీ లో లుకలుకలు బయలు దేరాయి. కాంగ్రెస్ , శివసేన, ఎన్సీపీ కలిసి ఎంవీఏగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
కాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై సంకీర్ణ సర్కార్ లో కీలక భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీకి చెందిన పీసీసీ చీఫ్ నానా పటోలే(Nana Patole) సంచలన ఆరోపణలు చేశారు ఎన్సీపీ చీఫ్ పవార్ పై.
సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఎన్సీపీ అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. తమ పార్టీని వెన్నుపోటు పొడుస్తోందంటూ ధ్వజమెత్తారు పటోలే(Nana Patole). వెనుక నుంచి దెబ్బ కొట్టడం కాకుండా ముందు నుంచి తమను ఎదుర్కొంటే బెటర్ అని హితవు పలికారు.
తాము ఏ పార్టీనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎన్సీపీ వివిధ రకాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురి చేసిందంటూ నానా పటోలే ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నుంచి ఎవరి వేధింపులను ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. అందుకు తగిన రీతిలో జవాబు ఇస్తామని హెచ్చరించారు నానా పటోలే(Nana Patole). రాష్ట్రంలో తమతో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు.
ప్రభుత్వంలో భాగమైనంత మాత్రాన నిలదీయ కూడదని ఏమైనా రూల్ ఉందా అని పేర్కొన్నారు.
Also Read : అదరను బెదరను ప్రశ్నిస్తూనే ఉంటా