Prashant Kishor : బీజేపీకి కాంగ్రెస్సే ప్ర‌త్యామ్నాయం

ఆప్ కానే కాద‌న్న ప్ర‌శాంత్ కిషోర్

Prashant Kishor : ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ , ఐప్యాక్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న అక్టోబ‌ర్ 2 నుంచి పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ త‌రుణంలో దేశ రాజ‌కీయాల గురించి నిర్మోహ మాటంగా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ కు బ్లూ ప్రింట్ త‌యారు చేసి ఇచ్చారు. పీకే (Prashant Kishor) కాంగ్రెస్ లో చేరుతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

కానీ తాను చేర‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితికి ప‌ని చేస్తున్నారు.

ఈ త‌రుణంలో దేశంలో ఆక్టోప‌స్ లా విస్త‌రించిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కొనే స‌త్తా కేవ‌లం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు.

కొంద‌రు ఆమ్ ఆద్మీ పార్టీ లేదా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ లేదా ఇత‌ర పార్టీల‌ను ఊహిస్తున్నాయ‌ని అది ఆచ‌ర‌ణ‌లో సాధ్యం అయ్యేది కాద‌ని స్ప‌ష్టం చేశారు పీకే. ఇదే స‌మ‌యంలో బీజేపీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor).

ఆన్ లైన్ ద్వారా జ‌రిగిన చ‌ర్చ‌లో పీకే పాల్గొన్నారు. ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. అన్నింటికీ మోదీపై ఆధార ప‌డ‌టం ఆ పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌న్నారు.

కాగా భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కోవ‌డం ఇప్పుడున్న‌ప‌రిస్థితుల్లో చాలా క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు పీకే. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం కావాలంటే అన్ని ప‌క్షాలు ఏక‌తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

బ‌రిలో ఉండాలంటే చాలా క‌స‌ర‌త్తు చేయాలని అభిప్రాయ ప‌డ్డారు పీకే.

 

Also Read : 2373 మందికి అపాయింట్మెంట్ లెట‌ర్స్

Leave A Reply

Your Email Id will not be published!