Twitter : ట్విట్టర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ గుడ్ బై
ఎలోన్ మస్క్ దెబ్బకు బిగ్ షాక్
Twitter : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ $44 మిలియన్ డాలర్లకు ఎప్పుడైతే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేశాడో ఆనాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి.
ఇప్పటికే సిఇఓగా ఉన్న ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ పట్ల మస్క్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. లీగల్ చీఫ్ గా ఉన్న మేడంపై కూడా గుర్రుగా ఉన్నారు.
కంపెనీ చట్టం ప్రకారం ఎలోన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్(Twitter) రావాలంటే ఇంకా ఆరు నెలల సమయం పడుతుంది. ఈ తరుణంలో ఒక్కరొక్కరు ట్విట్టర్ ను వీడేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సిఇఓ పరాగ్ అగర్వాల్ చెప్పినా ఎవరూ విశ్వసించడం లేదు. ఎలోన్ మస్క్ వచ్చీ రావడంతోనే ట్విట్టర్ పనితీరు బాగోలేదంటూ ట్వీట్ చేశాడు.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ తరుణంలో ట్విట్టర్ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న జనరల్ మేనేజర్ కేవోన్ బేకపూర్ , ఉత్పత్తుల చీఫ్ బ్రూస్ ఫాల్క్ కూడా వీడనున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ట్విట్టర్(Twitter) కూడా ధ్రువీకరించినట్లు టాక్. వీరిద్దరూ ట్విట్టర్ లో పరిశోధన, డిజైన్ , ఇంజనీరింగ్ విభాగాలకు బాధ్యతలు చేపట్టారు.
ఈ సెక్టార్స్ అత్యంత కీలకమైనవి. గ్లోబల్ మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ కు కొత్త యజమానిగా ఎలోన్ మస్క్ రాబోతున్నారు.
ఆయన ఫక్తు వ్యాపారవేత్త. సామాజిక నేపథ్యం కలిగిన వ్యక్తి కాదు. ఇప్పటికే ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్ లో టాప్ లో ఉంది. టెక్ కంపెనీ తనను తొలగించినట్లు బేకపూర్ వెల్లడించారు. నన్ను వెళ్లమని సిఇఓ అగర్వాల్ కోరారని తెలిపాడు.
Also Read : ఎయిర్ ఇండియా బాస్ గా క్యాంప్ బెల్ విల్సన్