Helicaptor Crash : రాయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో కూలిన హెలికాప్టర్
ల్యాండ్ చేసేందుకు యత్నిస్తుండగా పైలట్లు మృతి
Helicaptor Crash : తరుచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం షరా మామూలై పోయింది. మరో ఘటన చోటు చేసుకుంది ఛత్తీస్ గఢ్ లో. రాయ్ పూర్ విమానాశ్రయంలో హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
హెలికాప్టర్ ను ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ లో(Helicaptor Crash) సడెన్ గా మంటలు చెలరేగాయి. ఇదిలా ఉండగా విమానంలో ప్రయాణికులు లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కెప్టెన్ గోపాల కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కాగా -మన_ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ లో రాత్రి 9.10 గంటలకు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ అగర్వాల్ వెల్లడించారు(Helicaptor Crash).
ఈ ఘటనపై వెంటనే స్పందించారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి. పైలట్ల మృతికి సంతాపం తెలిపారు. రాయ్ పూర్ లోని విమానాశ్రయంలో రాష్ట్ర హెలికాప్టర్ కూలి పోవడం బాధాకరం.
ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఈ విషాద సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ దుఖః సమయంలో కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా.
వారికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నా. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఫ్యామిలీస్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం. అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.
Also Read : కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ కాల్చివేత