Owaisi : వారణాసి కోర్టు తీర్పుపై ఓవైసీ ఫైర్
మరో మసీదును కోల్పోవాలని అనుకోవద్దు
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవడానికి తాము సిద్దంగా లేమన్నారు.
ఆయన జ్ఞానవాపి తీర్పుపై స్పందించారు. ఇది పూర్తిగా అసంబద్దమైనదిగా పేర్కొన్నారు ఓవైసీ. కోర్టు ఆదేశం 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి నిస్సందేహైన ఉల్లంఘన అంటూ ధ్వజమెత్తారు.
ఇంకో మసీదును కోల్పోయేందుకు తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. కాగా చట్టం ప్రకారం ఏ వక్తి మతానికి చెందిన ప్రార్థనా స్థలం లేదా దాని లోని ఏదైనా విభాగానికి చెందిన ప్రార్థనా స్థలంగా మార్చ కూడదన్నారు.
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగుతోందని, మే 17 లోగా పూర్తి నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు కోర్టు ఇద్దరు న్యాయవాదులను కూడా చేర్చింది సర్వే కమిషన్ కు.
దీనిపై సీరియస్ అయ్యారు ఓవైసీ. బాబ్రీ మసీదు టైటిల్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించడమేనని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు పూర్తిగా చట్ట విరుద్దంగా ఉన్నాయన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును కూడా పట్టించు కున్నట్లుగా లేదని అనిపిస్తోందన్నారు ఓవైసీ(Owaisi). ఇది కఠోరమైన ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మసీదు కమిటీ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఒక దానిని కోల్పోయాం. ఇంకో దానిని కోల్పోయేందుకు సిద్దంగా లేమన్నారు ఓవైసీ(Owaisi).
Also Read : రాయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో కూలిన హెలికాప్టర్