NIA Dawood Ibrahim : దావూద్ గ్యాంగ్ పై ఎన్ఐఏ దాడి

చోటా ష‌కీల్ స‌హాయ‌కులు అరెస్ట్

NIA Dawood Ibrahim : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్ పై దాడి చేసింది. గ్యాంగ్ స్ట‌ర్ ఛోటా ష‌కీల్ స‌హాయ‌కుల‌ను అరెస్ట్ చేసింది.

ఈ వారం ప్రారంభంలో ముంబై క‌మిష‌న‌రేట్ లోని 24 చోట్ల‌, మీరా రోడ్ భ‌యంద‌ర్ క‌మిష‌న‌రేట్ లోని ఐదు చోట్ల ఎన్ఐఏ సోదాలు చేప‌ట్టింది.

ఇదిలా ఉండ‌గా దావూద్ ఇబ్ర‌హీంతో(NIA Dawood Ibrahim) పాటు మ‌రో 87 మందిపై తీవ్ర‌వాద సంబంధిత కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు

పాకిస్తాన్ ఆంక్ష‌లు విధించింది.

దావూద్ గ్యాంగ్ పై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ప్రారంభించిన అణిచి వేత‌లో భాగంగా గ్యాంగ్ స్ట‌ర్ ఛోటా ష‌కీల్ కు చెందిన ఇద్ద‌రు స‌హ‌చ‌రుల‌ను ద‌ర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది.

అరెస్టయిన నిందితుల‌ను ఆరిఫ్ అబూబ‌క‌ర్ షేక్ , ష‌బ్బీర్ అబూబాక‌ర్ షేక్ గా గుర్తించారు. ఇద్ద‌రూ ముంబై లోని ప‌శ్చిమ శివారు ప్రాంతాల్లో

డి – కంపెనీ చ‌ట్ట విరుద్ద కార్య‌క‌లాపాలు , ఉగ్ర‌వాద ఫైనాన్సింగ్ లో పాల్గొన్నార‌ని సీనియ‌ర్ ఎన్ఐఏ అధికారి వెల్లడించారు.

వీరిని శుక్రవారం ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌నున్న‌ట్లు తెలిపారు. సిండికేట్ మొత్తాన్ని స‌రిహ‌ద్దు దాటి దావూద్(NIA Dawood Ibrahim) గ్యాంగ్ న‌డుపుతున్న‌ట్లు ప‌రిశోధ‌న‌లు సూచిస్తున్నాయి.

వారి పాత్ర‌ల‌ను వివ‌రించేందుకు తాము ఇప్ప‌టికే 21 మంది వ్య‌క్తుల‌ను విచారించిన‌ట్లు తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో ముంబై క‌మిష‌న‌రేట్ లోని 24 చోట్ల , మీరా రోడ్ భ‌యంద‌ర్ క‌మిష‌న‌రేట్ లోని ఐదు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ(NIA Dawood Ibrahim).

తాము ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, రియ‌ల్ ఎస్టేట్, న‌గ‌దు, తుపాకులకు సంబంధించిన ప‌త్రాల రూపంలో చాలా సాక్ష్యాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

ఎన్ఐఏ తెలిపిన ప్ర‌కారం ఛోటా ష‌కీల్ బావ స‌లీం ఖురేషీ అలియాస్ స‌లీం ఫ్రూట్ , మ‌హిమ్ , హాజీ అలీ ద‌ర్గాల మేనేజింగ్ ట్ర‌స్టీ సుహైల్ ఖాండ్యానీ ఉన్నారని వెల్ల‌డించారు.

బాలీవుడ్ నిర్మాత 1993 ముంబై పేలుళ్ల నిందితుడు స‌మీర్ హింగోరాని, హ‌వాలా ఆప‌రేట‌ర్ అబ్దుల్,

క‌య్యూమ్ , బుకీగా మారిన బిల్డ‌ర్ అజ‌య్ ఘోసాలియా అలియాస్ అజ‌య్ గండా, మొబిదా భివాండివాలా,

గుడ్డు ప‌ఠాన్ , రెస్టారెంట్ య‌జమాని అస్లాం స‌రోడియా ఉన్నార‌ని తెలిపారు.

 

Also Read : మాజీ మంత్రి కేవీ థామ‌స్ పై కాంగ్రెస్ వేటు

Leave A Reply

Your Email Id will not be published!