Modi Condolence : షేక్ ఖలీఫా మృతిపై మోదీ దిగ్భ్రాంతి
గొప్ప నాయకుడు..దార్శనికుడని నివాళి
Modi Condolence : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్, అబుదాబి రాజు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ శుక్రవారం కన్ను మూశారు. ఆయనకు 73 ఏళ్లు. 2004 నుంచి యూఏఇకి అధ్యక్షుడిగా ఉన్నారు.
18 ఏళ్ల పాటు పాలకుడిగా తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Modi Condolence) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గొప్ప నాయకుడిని ప్రపంచం కోల్పోయిందన్నారు.
ట్విట్టర్ వేదికగా స్పందించారు మోదీ. భవిష్యత్తు పట్ల ముందు చూపు కలిగిన గ్రేట్ లీడర్ అంటూ కొనియాడారు. కేరళతో ఎల్లవేళలా సత్సంబంధాలు కొనసాగించారంటూ కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మోదీ(Modi Condolence)తో పాటు భారత దేశానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. భారత దేశంతో యూఏఇ బలమైన బంధం కొనసాగిస్తూ వచ్చింది.
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఎల్లప్పుడూ ఇండియాతో సత్ సంబంధాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స కు దీర్ఘ కాలంగా ప్రెసిడెంట్ గా, అబుదాబికి ప్రిన్స్ గా పని చేసిన ఖలీఫా మరణం తనను ఎంతగానో బాధకు గురి చేసిందని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం యూఏఈ ప్రభుత్వానికి, ప్రజలకు సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా యూఏఈ ప్రభుత్వం ప్రెసిడెంట్ మృతికి సంతాప సూచకంగా 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
Also Read : కాంగ్రెస్ జెండా సమస్యలే ఎజెండా