Parag Agarwal : ట్విట్టర్ లో లైట్లు వెలగడం లేదు : సిఇఓ
పరాగ్ అగర్వాల్ సంచలన కామెంట్స్
Parag Agarwal : ట్విట్టర్ సిఇఓ ప్రవాస భారతీయుడు పరాగ్ అగర్వాల్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రపంచ కుబేరుడు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ $44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాక పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.
ఆయన ప్రధానంగా సిఇఓను టార్గెట్ చేశారు. ఈ తరుణంలో పరాగ్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే ట్విట్టర్ లో పరిశోధన, డెవలప్ మెంట్ విభాగంతో పాటు ఉత్పత్తులకు సంబంధించి చీఫ్ గా పని చేస్తున్న ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించింది ట్విట్టర్.
ఈ విషయాన్ని వారే ట్వీట్ చేశారు. అనుకోని రీతిలో సిఇఓ పరాగ్ తమను తప్పుకోమని కోరాడని తెలిపారు. ట్విట్టర్ లో మస్క్ ఎంట్రీ అయ్యాక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ సందర్భంగా ట్విట్టర్ గురించి పరాగ్ అగర్వాల్(Parag Agarwal) శనివారం చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ట్విట్టర్ లో లైట్లు వెలగడం లేదని పేర్కొనడం మరింత ఆసక్తిని రేపింది.
తమ టీమ్ లో చోటు చేసుకున్న మార్పుల గురించి వివరణ ఇచ్చాడు సిఇఓ. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అందుకే సుదీర్ఘంగా సమాధానం ఇవ్వాల్సి వస్తోందని తెలిపాడు పరాగ్ అగర్వాల్(Parag Agarwal). డీల్ ముగుస్తుందని అనుకున్నప్పుడు మా పరంగా అన్నింటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నాడు.
ట్విట్టర్ ను నడిపించడం, నిర్వహించడం కోసం నేను మరింత సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు సిఇఓ. భవిష్యత్తులో తీసుకోబోయే యాజమాన్యం గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నాడు.
Also Read : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేత