Mahinda Rajapaksa : ఉపేక్షించొద్దు మహిందను అరెస్ట్ చేయండి
సీఐడీని ఆదేశించిన శ్రీలంక న్యాయస్థానం
Mahinda Rajapaksa : శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి కారణం వహిస్తూ ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకున్న మహింద రాజపక్సే కోలుకోలేని షాక్ ఇచ్చింది సర్వోన్నత న్యాయ స్థానం. ఇప్పటికే ప్రజాగ్రహానికి గురైన మహింద నేవీ స్థావరంలో తలదాచుకుంటున్నారు.
ఇంకో వైపు ఆయన స్థానంలో రణిలె విక్రమసింఘె పీఎంగా కొలువుతీరారు. కానీ శ్రీలంకలో నిరసనలు , ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
మాజీ మంత్రికి చెందిన వాహనాన్ని నీళ్లలో వేశారు. ఎవరు కనిపించినా అధికార పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ తరుణంలో దేశం విడిచి పారి పోదామని అనుకున్న మాజీ ప్రధానికి బిగ్ షాక్ ఇచ్చింది కోర్టు.
ఎక్కడికీ వెళ్లకుండా మహింద రాజపక్సే(Mahinda Rajapaksa) తో పాటు మరో 15 మంది నాయకులపై నిషేధం విధించింది. ఈ తరుణంలో పిడుగు మీద పడ్డట్టు శ్రీలంక కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
మహింద రాజపక్సేతో(Mahinda Rajapaksa) పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేయాలని సీఐడికి ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వారిపై దాడులు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.
ఆర్థిక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ మహీందాతో పాటు ఎంపీలు ఫెర్నాండో, సంజీవ, నిశాంత, సమన్ లాల్ , తెన్న కూన్, విక్రమరత్నను అరెస్ట్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ తీర్పు చెప్పింది.
శ్రీలంక కోర్టు మహింద రాజపక్స కుమారుడు కూడా దేశం విడిచి వెళ్ల కూడదంటూ ఆదేశించింది.
Also Read : యూఏఇ అధ్యక్షుడు షేక్ ఖలీఫా కన్నుమూత