Amit Shah : కేసీఆర్ ఖేల్ ఖతం మాదే రాజ్యం
కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ కు అంత సీన్ లేదన్నారు. ఆయన పని అయి పోయిందన్నారు.
కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా కష్ట పడితే రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ప్రగతి భవన్ పై ఎగరడం ఖాయమన్నారు. ఆయన ప్రసంగం మొత్తం కేసీఆర్ పై నిప్పులు చెరగడంతోనే సరి పోయింది.
ఆయనను గద్దె దించడం సులభమేనని, తాను రానక్కర్లేదన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఒక్కడు చాలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్ర సంక్షేమం కోసమే బీజేపీ యాత్ర చేపట్టిందన్నారు. జన కంఠక పాలనను అంతం చేసేందుకే ఈ యాత్ర చేపట్టామన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు. రాష్ట్రంపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని స్పష్టం చేశారు అమిత్ షా(Amit Shah).
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కలలు కంటున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. అవాకులు చెవాకులు పేలితే చివరకు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
బండి సంజయ్ చేపట్టిన యాత్ర సక్సెస్ సందర్భంగా హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా(Amit Shah) పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ నిజాం లాగా భావిస్తూ పాలన సాగిస్తున్న కేసీఆర్ ను మార్చేందుకే ఈ యాత్ర చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు ట్రబుల్ షూటర్. నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా అని ప్రశ్నించారు.
Also Read : భాగ్యనగరం దేశానికి తలమానికం