Uddhav Thackeray : మరాఠాలో బీజేపీ కుట్రలు సాగవు – ఉద్దవ్ ఠాక్రే
ముంబైని ముట్టుకుంటే అగ్నిగుండమే
Uddhav Thackeray : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై నిప్పులు చెరిగారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీని తరిమి కొట్టామని అన్నారు.
ఆ పార్టీ నాయకుల్ని గాడిదలతో పోల్చారు. శివసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన బీజేపీని టార్గెట్ చేశారు. గత కొంత కాలం నుంచి బీజేపీ వర్సెస్ శివసేన మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా మారందని మండిపడ్డారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). తాము గధా ధారి హిందువులని ఫడ్నవిస్ అంటున్నారు.
బీజేపీతో పొత్తు తెచ్చుకున్న సమయంలోనే నీతి తప్పిన వారిని తరిమి కొట్టమన్నారు. బీజేపీతో 25 ఏళ్ల పాటు పొత్తు పెట్టు కోవడం వల్ల మహారాష్ట్రాలో తాము ఎంతో నష్ట పోయామని చెప్పారు ఉద్దవ్ ఠాక్రే. మరాఠా నుంచి ముంబైని విడదీయాలనే బీజేపీ కుట్రలు ఫలించవన్నారు.
ఒకవేళ ముట్టుకోవాలని చూస్తే అగ్ని గుండమే అవుతుందని హెచ్చరించారు. తమతో పెట్టుకోవాలని అనుకున్న వాళ్లు ఎవరూ ఎదురుగా నిలబడిన దాఖలాలు లేవన్నారు. ధర్మ యుద్దానికైనా త్యాగానికైనా శివసేన రెడీగా ఉంటుందన్నారు.
ఒకవేళ కావాలని బీజేపీ తమతో కయ్యానికి కాలు దువ్వుతానంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). అంతే కాదు ఆయన బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ పార్టీ ఫేక్ హిందూత్వ బురఖా ధరించిందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా మీ ఆటలు మరాఠాలో సాగవన్నారు.
Also Read : పార్టీ నిర్ణయం శిరోధార్యం – బిప్లబ్ దేబ్