Kaushik Basu : మోదీ ప్ర‌భుత్వం దేశానికి ప్ర‌మాదం

ఆర్థిక వేత్త కౌశిక్ బ‌సు తీవ్ర ఆందోళ‌న

Kaushik Basu : దేశంలో మోదీ పాల‌న గాడి త‌ప్పింది. కేంద్ర ప్ర‌భుత్వానికి దిశా నిర్దేశం అంటూ ఏదీ లేదు. మేకిన్ ఇండియా, స్టార్ట ప్ ఇండియా, మ‌న్ కీ బాత్ లాంటి కార్య‌క్ర‌మాలు దేశాన్ని స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కిస్తాయ‌ని అనుకోవ‌డం భ్రమ‌.

ఇలా ఎంత కాలం మ‌తం పేరుతో ప్రాంతాల పేరుతో రాజ‌కీయం చేస్తారు. ఇలా చేస్తే చివ‌ర‌కు ద్వీప దేశం శ్రీ‌లంక‌లో నెల‌కొన్న ప‌రిస్థితే భార‌త్ లో నెల‌కొనే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇక‌నైనా మోదీ స‌ర్కార్ లో మార్పు రావాలి.

లేక పోతే దేశానికి అత్యంత ప్ర‌మాద ఘంటిక‌లు మోగే కాలం కొద్ది దూరంలోనే ఉంద‌ని హెచ్చ‌రించారు ప్ర‌ముఖ దేశ ఆర్థిక వేత్త కౌశిక్ బ‌సు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింది.

ఇక ప్ర‌పంచ మార్కెట్ లో డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ మ‌రింత క‌నిష్టానికి ప‌డి పోయింది. ఇది ప‌త‌నాన్ని సూచిస్తుంది.

ఇంత మంది మేధావులు, ఆర్థిక వేత్త‌లు, నీతి ఆయోగ్ లో ప‌ని చేస్తున్న వారికి తోచ‌డం లేదా. లేక తెలిసి మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్ర‌శ్నించారు ఈ ఆర్థిక వేత్త‌.

ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా దేశంలో సివిల్ స‌ర్వెంట్స్ వ్య‌వ‌స్థ బాగుంది. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాడుకోగ‌లిగితే మేలు అని సూచించారు కౌశిక్ బ‌సు(Kaushik Basu). ఎలాంటి ప్లాన్ లేని ప‌రిపాల‌న దేశానికి ముప్పుగా ప‌రిణ‌మించింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా కౌశిక్ బ‌సు(Kaushik Basu) ప్రపంచ బ్యాంకులో ప్ర‌ధాన ఆర్థిక వేత్త‌గా ప‌ని చేశారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే భార‌త దేశంలో పేద‌రికం, నిరుద్యోగం భారీగా పెరిగింద‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని కూడా భార‌త దేశం దిగుమ‌తి చేసుకుంటోంద‌న్నారు.

Also Read : మ‌రాఠాలో బీజేపీ కుట్ర‌లు సాగ‌వు – ఉద్ద‌వ్ ఠాక్రే

Leave A Reply

Your Email Id will not be published!