KTR : అమిత్ షా అబద్దాలకు బాద్ షా
నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
KTR : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. అమిత్ షా అబద్దాలకు బాద్ షాగా అభివర్ణించారు.
తెలంగాణ భవన్ లో ఆదివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడలో జరిగిన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్, కేసీఆర్(KTR) ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు.
దీంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కొందరు నాయకులు హైదరాబాద్ కు టూరిస్టులుగా వస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ తాగుతూ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లి పోతున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ చేశారంటూ సెటైర్ వేశారు. పదవులు అమ్ముకునే సంస్కృతి బీజేపీలో నెలకొందన్నారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ ఇస్తేనే నిధులు మంజూరు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు.
ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేనే సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక సీఎం పదవి రూ. 2, 500 కోట్లు అని. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా ఉన్న కాషాయ పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు కేటీఆర్.
ఆయన అమిత్ షాపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ అడిగితే ఒక్క ప్రశ్నకు కేంద్ర హోం శాఖ మంత్రి సమాధానం ఇవ్వలేదన్నారు.
రాష్ట్రంలో స్టీరింగ్ మా చేతుల్లో ఉందని కానీ కేంద్ర ప్రభుత్వ స్టీరింగ్ మాత్రం బడా బాబుల చేతుల్లో ఉందన్నారు కేటీఆర్(KTR).
Also Read : కేసీఆర్ ఖేల్ ఖతం మాదే రాజ్యం